logo

వ్యాపారవేత్తలది కీలకపాత్ర

‘సమాజానికి మంచి చేయాలనే కోరిక నాయకుడిలో బలంగా ఉండాలి. లక్ష్యం దిశగా సాగుతూ విలువలు పాటించాల’ని ఐఎస్‌బీ ఛైర్మన్‌ హరీశ్‌ మన్వానీ ఉద్బోధించారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచ దేశాలతో పోటీపడి అత్యంత వేగంగా భారత్‌

Published : 27 May 2022 04:05 IST

ఐఎస్‌బీ ఛైర్మన్‌ హరీశ్‌ మన్వానీ


ఐఎస్‌బీ ఆవరణలో మొక్క నాటి నీరు పోస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో స్కూల్‌ డీన్‌ మదన్‌ పిల్లుట్ల, ఛైర్మన్‌ హరీశ్‌ మన్వానీ తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: ‘సమాజానికి మంచి చేయాలనే కోరిక నాయకుడిలో బలంగా ఉండాలి. లక్ష్యం దిశగా సాగుతూ విలువలు పాటించాల’ని ఐఎస్‌బీ ఛైర్మన్‌ హరీశ్‌ మన్వానీ ఉద్బోధించారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రపంచ దేశాలతో పోటీపడి అత్యంత వేగంగా భారత్‌ ఆర్థికరంగంలో వృద్ధి దిశగా పరుగులు తీయడం శుభదాయకం. వ్యాపారం చేయడమంటే కేవలం పెట్టుబడి పెట్టిన భాగస్వాముల లబ్ధి కోసం పనిచేయడం మాత్రమే కాదు.. సాధారణ విపణిలో కొనుగోలు చేస్తూ భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరికీ లాభం చేకూర్చాలి. సమాజంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు చూపడంలోనూ వ్యాపారవేత్తలు కీలకపాత్ర పోషించాలి. నాయకుల్లో పోటీతత్వం ఉండాలి. అదే సమయంలో కరుణ, సున్నితత్వం, చురుకుదనం ఉండాలి. ఈ తరహా నాయకులను ఐఎస్‌బీ తయారు చేస్తోంది. ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్ల మాట్లాడుతూ.. ‘తొలిసారిగా హైదరాబాద్‌, మొహాలీ క్యాంపస్‌ల విద్యార్థులతో కలిసి వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధాని రావడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడు, మొహాలీ ఐఎస్‌బీ సలహామండలి ఛైర్మన్‌ రాకేశ్‌ మిత్తల్‌ మోదీకి జ్ఞాపిక అందజేశారు. ‘ఐఎస్‌బీ మై స్టాంప్‌’ పేరిట ప్రత్యేక తపాలా బిళ్లను ప్రధాని విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని