logo

ప్రమాదంలో పౌర హక్కులు: సురవరం సుధాకర్‌రెడ్డి

దేశంలో ప్రస్తుతం పౌర, మానవ హక్కులకు ప్రమాదం ఏర్పడిందని, ప్రజాస్వామ్యం పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కవులు, కళాకారులు తమ పాత్ర

Published : 27 Jun 2022 02:40 IST

పుస్తకంతో సురవరం సుధాకర్‌రెడ్డి, గోరటి వెంకన్న, భీమనేని శ్రీనివాసరావు, మాదాల రవి తదితరులు  

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: దేశంలో ప్రస్తుతం పౌర, మానవ హక్కులకు ప్రమాదం ఏర్పడిందని, ప్రజాస్వామ్యం పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. కవులు, కళాకారులు తమ పాత్ర పోషించాల్సి ఉందని స్పష్టం చేశారు. నల్లూరి వెంకటేశ్వర్లు రచించిన ‘నేను నడిచినబాట’ పుస్తక పరిచయ కార్యక్రమం ఆదివారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడారు. సినీనటుడు మాదాల రవి, నిర్మాత పోకూరి బాబూరావు, దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, బాబ్జీ, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌, సీపీఐ నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, సీపీఎం నాయకుడు శాంతారావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అరసం నాయకుడు ఎస్వీ సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. డా.బీవీ విజయలక్ష్మి, పశ్యపద్మ, కె.ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని