Yashwant Sinha: ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..?: యశ్వంత్ సిన్హా

దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవివరంగా చెప్పారని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జలవిహార్‌లో...

Updated : 02 Jul 2022 16:16 IST

హైదరాబాద్: దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) సవివరంగా చెప్పారని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwant sinha) అన్నారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో యశ్వంత్‌ సిన్హా మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తెరాస సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌,  మంత్రి కేటీఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెరాస ప్రతినిధులు చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.

‘‘చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదు. ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం అంతకన్నా కాదు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటం. విద్వేషపూరిత ప్రసంగాలు సమాజానికి మంచివి కాదు. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..? ఇదేనా ప్రజాస్వామ్యం. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా పోరాటం కొనసాగుతుంది. దేశానికి కేసీఆర్‌ వంటి నేత అవసరం. ఇప్పుడు చేసే పోరాటం భారత్‌ భవిష్యత్తు కోసం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసేది. కేసీఆర్‌తో మరోసారి సమావేశమవుతా’’ అని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని