NITI Aayog: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన నీతి ఆయోగ్‌

నీతి ఆయోగ్‌ నిరర్థక సంస్థగా మారిందని, అందుకు నిరసనగా.. దిల్లీలో రేపు జరగబోయే ఆ సంస్థ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

Published : 06 Aug 2022 20:56 IST

దిల్లీ: నీతి ఆయోగ్‌ నిరర్థక సంస్థగా మారిందని, అందుకు నిరసనగా.. దిల్లీలో రేపు జరగబోయే ఆ సంస్థ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ... నీతి ఆయోగ్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఒక భజన మండలిగా మారిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అయితే, సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను నీతి ఆయోగ్‌ ఖండించింది. సమావేశాన్ని సీఎం కేసీఆర్‌ బహిష్కరించటం దురదృష్టకరమని తెలిపింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం బహిష్కరణ సరికాదని హితవు పలికింది. బలమైన రాష్ట్రాలు, దేశం తయారు చేయటమే సంస్థ లక్ష్యమని పేర్కొంది. గతేడాది సీఎంలతో 30కి పైగా సమావేశాలు జరిగాయని, రాష్ట్రాల మధ్య సహకారానికి మార్గం సుగమం చేశామని నీతిఆయోగ్‌ వెల్లడించింది. రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించామని, జల్‌జీవన్‌ మిషన్‌ కింద తెలంగాణకు కేంద్రం రూ.3982 కోట్లు కేటాయించిందని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని