logo

నాణ్యమైన ఉత్పత్తులతోనే చైనాతో పోటీ

చైనాతో పోటీపడాలంటే నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడమే మనకు ప్రత్యామ్నాయమని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ అన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా తరువాత భారత్‌లో పరిశ్రమలకు నాణ్యత స్పృహ పెరిగిందన్నారు.

Published : 19 Aug 2022 02:06 IST

మాట్లాడుతున్న జయేష్‌ రంజన్‌  

మాదాపూర్, న్యూస్‌టుడే: చైనాతో పోటీపడాలంటే నాణ్యమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడమే మనకు ప్రత్యామ్నాయమని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ అన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా తరువాత భారత్‌లో పరిశ్రమలకు నాణ్యత స్పృహ పెరిగిందన్నారు. గురువారం మాదాపూర్‌ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ మెషిన్‌ టూల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఎక్స్‌పో(హిమ్‌టెక్స్‌) ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. చైనా చౌకైన ఉత్పత్తులను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందిందన్నారు. డిఫెన్స్, ఏరోస్పెస్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు హైదరాబాద్‌ కేంద్రంగా మారిందన్నారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సీనియర్‌ వైస్‌ ప్రైసిడెంట్‌ జయదేవ్‌ మాట్లాడుతూ.. 11 రాష్ట్రాలకు చెందిన కంపెనీలు మెషిన్‌ టూల్స్‌ ప్రదర్శనకు ఉంచాయన్నారు. ప్రాసెస్‌ ఎక్స్‌పో అండ్‌ కాన్ఫరెన్స్‌(ఐపీఈసీ) పేరిట ఏర్పాటు చేసిన సదస్సును జయేష్‌ రంజన్‌ ప్రారంభించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని