logo

ఫార్ములా-ఈ రేస్‌ కార్లొచ్చాయ్‌

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నగరంలో జరగబోయే ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించి రెండు కార్లు నగరానికి చేరుకున్నాయి. ప్రజల సందర్శనార్థం వీటిని నెక్లెస్‌ రోడ్డులో ఆదివారం ప్రదర్శించనున్నట్లు హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్లు 3 సెకన్లలోనే 62 కి.మీ.

Published : 25 Sep 2022 03:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నగరంలో జరగబోయే ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించి రెండు కార్లు నగరానికి చేరుకున్నాయి. ప్రజల సందర్శనార్థం వీటిని నెక్లెస్‌ రోడ్డులో ఆదివారం ప్రదర్శించనున్నట్లు హెచ్‌ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్లు 3 సెకన్లలోనే 62 కి.మీ. వేగాన్ని అందుకొని.. గరిష్ఠంగా గంటకు 280 కి.మీ. మేరకు ప్రయాణించగలవు. ఈవీ టెక్నాలజీతో నడిచే ఒక్కో కారు పొడవు 5160 ఎంఎం కాగా వెడల్పు 1770 ఎంఎం, ఎత్తు 1050 ఎంఎంతోపాటు 900 కిలోల బరువు ఉంటాయి. బ్యాటరీ బరువు 385 కిలోలు కాగా..200 కిలోవాట్ల శక్తి వీటి సొంతం. ఈ పోటీల కోసం ఇప్పటికే హెచ్‌ఎండీఏ రెండున్నర కి.మీ. ట్రాక్‌ను సిద్ధం చేస్తోంది. ఈ ట్రాక్‌ సచివాలయం నుంచి ఎన్టీఆర్‌ పార్కు లోపలకు వెళ్లి అక్కడ నుంచి మింట్‌ కాంపౌండ్‌లోకి వచ్చి ఐమాక్స్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోకి చేరి మళ్లీ సచివాలయం వద్దకు వస్తుంది. ఫార్ములా ఈ-రేస్‌ కార్ల అంశాన్ని మంత్రి కేటీఆర్‌ హెచ్‌ఎండీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోకాపేటలో నియోపొలిస్‌ టౌన్‌షిప్‌ను పరిశీలించేందుకు శనివారం వెళ్లిన ఆయన అక్కడ హెచ్‌ఎండీఏ అధికారులతో ఈ విషయం మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని