logo

‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ్‌ భారత్‌’ సభ 1న

నగరంలోని విభిన్న రాష్ట్రాల వారితో అక్టోబరు 1న ‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ్‌ భారత్‌’ సభ  నిర్వహించనున్నట్లు భాజపా మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జి మురళీధర్‌ రావు తెలిపారు. నారాయణగూడ కేశవ్‌ మెమోరియల్‌లో జరిగే సభలో ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను

Published : 25 Sep 2022 04:08 IST

మాట్లాడుతున్న మురళీధర్‌రావు. చిత్రంలో రితీశ్‌ జాగిర్దార్, ఆర్‌కే జైన్, ముఖేశ్‌ చౌహాన్, జస్మత్‌పటేల్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: నగరంలోని విభిన్న రాష్ట్రాల వారితో అక్టోబరు 1న ‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ్‌ భారత్‌’ సభ  నిర్వహించనున్నట్లు భాజపా మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జి మురళీధర్‌ రావు తెలిపారు. నారాయణగూడ కేశవ్‌ మెమోరియల్‌లో జరిగే సభలో ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను చాటే కళా బృందాలు, నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినోత్సవంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా శనివారం కాచిగూడలో తెలంగాణ గుజరాతీ సమాజ్‌ అధ్యక్షుడు జస్మత్‌పటేల్, అఖిల భారత జైన్‌ మైనార్టీ కౌన్సిల్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ రితీశ్‌ జాగిర్దార్, జైన్‌ రాజనీతిక్‌ చేతనామంచ్‌ అధ్యక్షుడు ఆర్‌కే జైన్, ముఖేశ్‌ చౌహాన్, దర్శన్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేషన్‌ కిట్లు, దుప్పట్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని