logo

‘అన్నపూర్ణ’.. పౌష్టికాహారం జోడిస్తే సంపూర్ణ!

అన్నపూర్ణ క్యాంటీన్లు.. నగరంలో రూ.5కే భోజనం పెట్టే అమృత భాండాగారాలు. ఈ భోజనంలో పౌషకాహారాన్ని జోడించి, శుచీశుభ్రత పాటిస్తే మరింత మేలు కలుగుతుందని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ), అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.

Published : 04 Oct 2022 03:04 IST

రూ.5 భోజనాన్ని బలోపేతం చేయాలని

కోరుతున్న అన్నార్తులు.. అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: అన్నపూర్ణ క్యాంటీన్లు.. నగరంలో రూ.5కే భోజనం పెట్టే అమృత భాండాగారాలు. ఈ భోజనంలో పౌషకాహారాన్ని జోడించి, శుచీశుభ్రత పాటిస్తే మరింత మేలు కలుగుతుందని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ), అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. 30 కేంద్రాల్లో అధ్యయనం చేసి.. సమస్యలు, లోపాలను గుర్తించారు. భోజనం పోషకాహారయుక్తంగా చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచించారు. ‘‘ఇంత కనిష్ఠ ధరకు ఎక్కడా భోజనం దొరకదు. అయితే కూరలు సరిగా వండటం లేదు. ఆలుగడ్డల తొక్క తీయడం లేదు. అన్నం సరిగా ఉడకడం లేదు. సాంబారులో పిండి కలుస్తోంది. నాణ్యత పాటిస్తే మరింత మంచిది’’ అని చిలకలగూడలో ఓ మేస్త్రీ పేర్కొన్నారు.

లోపాలు.. బలోపేతాలు

* ఉదయం 10.30-11.30 గంటల మధ్య తెరుస్తున్నారు. 2-3 గంటల్లో మూసేస్తున్నారు. ఉదయం 9 గంటలకే తెరిచి అల్పాహారం సైతం అందించాలి. రాత్రిళ్లు కేంద్రాలు నిర్వహించాలి.

* తాగునీటి సదుపాయం కల్పించాలి.

* వీలున్న చోట కూర్చునే సదుపాయం ఉండాలి.

* మహిళలు, పిల్లలూ తినేలా చూడాలి. మహిళా సూపర్‌వైజర్ల సంఖ్య పెరగాలి. ఇందుకు స్వయం సహాయక బృందాల సేవలు వినియోగించుకోవచ్ఛు

* తిన్న ప్లేట్లు చిందరవందరగా పడేస్తుండటంతో అపరిశుభ్రత తాండవిస్తోంది.

నగరంలో ‘అన్నపూర్ణ’ స్వరూపం

మొత్తం కేంద్రాలు: 150

నిత్యం భోజనం చేసేవారు: 25000

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని