logo

నాడు వ్యర్థాలకు నిలయం.. నేడు తలమానికం

నాడు చెత్తా చెదారంతో దుర్గంధం వెదజల్లే ఒక ప్రాంతం అది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని చూస్తే.. నమ్మలేనంతగా తీర్చిదిద్దడం విశేషం. ప్రస్తుతం అన్ని వసతులతో ఆధునిక శ్మశానవాటికగా ఆ స్థలం రూపురేఖలు మార్చేశారు.

Published : 06 Dec 2022 02:19 IST

ఆధునిక మరుభూమిని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

ఫతుల్లాగూడలో సిద్ధమైన శ్మశానవాటిక

ఈనాడు, హైదరాబాద్‌: నాడు చెత్తా చెదారంతో దుర్గంధం వెదజల్లే ఒక ప్రాంతం అది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని చూస్తే.. నమ్మలేనంతగా తీర్చిదిద్దడం విశేషం. ప్రస్తుతం అన్ని వసతులతో ఆధునిక శ్మశానవాటికగా ఆ స్థలం రూపురేఖలు మార్చేశారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గం నాగోల్‌ డివిజన్‌ ఫతుల్లాగూడలో మూడు మతాలకు ఒకేచోట శ్మశానవాటికను ఏర్పాటు చేశారు. 6.5 ఎకరాల్లో రూ.16.25 కోట్లు వెచ్చించిన హెచ్‌ఎండీఏ ఈ పనులు పూర్తి చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.టి.రామారావు చేతుల మీదుగా దీనిని మంగళవారం ప్రారంభించనున్నారు. నగరంలో ఒకేచోట మూడు మతాల శ్మశానవాటిక నిర్మించడం ఇదే తొలిసారి. దేశవిదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియలను ప్రత్యక్షంగా లింకు ద్వారా లైవ్‌లో వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు నాగోల్‌-గౌరెల్లి రేడియల్‌ రోడ్డులో ఇందుఅరణ్య నుంచి ఫతుల్లాగూడ మీదుగా రూ.60 కోట్ల వ్యయంతో మూసీ వరకు నిర్మించిన వంద అడుగుల లింకు రోడ్డును,  ఎస్‌ఎన్‌డీపీ కింద సుమారు రూ.30 కోట్లతో బండ్లగూడ చెరువు నుంచి నాగోల్‌ చెరువు మీదుగా మూసీ వరకు చేపట్టిన నాలాను, ఫతుల్లాగూడలోని జంతు సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన జంతువుల దహనవాటిక, వనస్థలిపురంలో నిర్మించిన ఈతకొలనును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని