logo

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ల పాత్ర కీలకం

మిలటరీ విమానయానంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ల పాత్ర కీలకమని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌ ఎయిర్‌ మార్షల్‌ బి.చంద్రశేఖర్‌ అన్నారు.

Published : 08 Dec 2022 02:29 IST

క్యాడెట్స్‌తో దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌ ఎయిర్‌ మార్షల్‌ బి.చంద్రశేఖర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మిలటరీ విమానయానంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్ల పాత్ర కీలకమని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌ ఎయిర్‌ మార్షల్‌ బి.చంద్రశేఖర్‌ అన్నారు. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వెలెన్స్‌ సర్వీసెస్‌(ఏటీఎస్‌ఎస్‌), ఎయిర్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎయిర్‌లాస్‌ గ్రాడ్యుయేషన్‌ డే బుధవారం ఘనంగా జరిగింది. ఏటీఎస్‌ఎస్‌లో 143మంది, ఎయిర్‌ మేనేజ్‌మెంట్‌లో 108మంది శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు.  వేడుకలకు అకాడమీ కమాండెంట్‌ ఎయిర్‌ మార్షల్‌ బి.చంద్రశేఖర్‌ ఆర్‌వోగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని