logo

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు భారీ జనసమీకరణ

హుస్సేన్‌సాగర్‌ తీరంలోని నిర్మించిన 125 అడుగుల ఎత్తైన బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ వచ్చేనెల 14న నిర్వహించనున్న సందర్భంగా బహిరంగ సభకు...

Published : 19 Mar 2023 02:11 IST

సమావేశంలో మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ, నేతలు దాసోజు శ్రవణ్‌, ప్రభాకర్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌ తీరంలోని నిర్మించిన 125 అడుగుల ఎత్తైన బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ వచ్చేనెల 14న నిర్వహించనున్న సందర్భంగా బహిరంగ సభకు, 30న సచివాలయ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని భారాస హైదరాబాద్‌ జిల్లా కమిటీ నిర్ణయించింది. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌అలీ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణభవన్‌లో  కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ.. ఈ రెండు ఉత్సవాలు కనుల పండువగా జరుగుతాయన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియంలో సభ నిర్వహిస్తామని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాలు ఏప్రిల్‌ 20 వరకు, 27న పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు ఉంటాయన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, మేయర్‌ విజయలక్ష్మి, ఉపమేయర్‌ శ్రీలత, ఎమ్మెల్సీ వాణిదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని