logo

మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలి

మహిళా బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 20 Mar 2023 02:27 IST

మాట్లాడుతున్న రాజేందర్‌పటేల్‌గౌడ్‌. చిత్రంలో బీసీ నేతలు

గోల్నాక, న్యూస్‌టుడే: మహిళా బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం చాదర్‌ఘాట్‌ మోతీమార్కెట్‌లోని కార్యాలయంలో ముఖ్య నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌, ఇతర పార్టీలు మహిళా బిల్లు విషయంలో ఏకం కావాలని కోరారు. అన్ని రాష్ట్రాల్లో మహిళా బిల్లు కోసం తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మహిళలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నేతలు భూషణ్‌భాస్కర్‌, ప్రత్యూష్‌, రాజు, లక్ష్మయ్యగౌడ్‌, బాబు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని