ప్రమాదంలేని ప్రయాణమే ఆర్టీసీ లక్ష్యం
ప్రమాదాలు లేని ప్రయాణమే టీఎస్‌ఆర్టీసీ లక్ష్యం కావాలని ఎండీ వీసీ సజ్జనార్ సిబ్బందికి సూచించారు. హైదరాబాద్‌లోని జేబీఎస్ ప్రాంగణంలో సోమవారం టీఎస్‌ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్ (టాక్ట్)పేరిట శిక్షణను ప్రారంభించి మాట్లాడారు.
సిబ్బంది శిక్షణలో ఎండీ వీసీ సజ్జనార్
ఈనాడు, హైదరాబాద్: ప్రమాదాలు లేని ప్రయాణమే టీఎస్‌ఆర్టీసీ లక్ష్యం కావాలని ఎండీ వీసీ సజ్జనార్ సిబ్బందికి సూచించారు. హైదరాబాద్‌లోని జేబీఎస్ ప్రాంగణంలో సోమవారం టీఎస్‌ఆర్టీసీ ఏప్రిల్ ఛాలెంజ్ ఫర్ ట్రైనింగ్ (టాక్ట్)పేరిట శిక్షణను ప్రారంభించి మాట్లాడారు. టాక్ట్‌లో భాగంగా సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, వివిధ విభాగాల సిబ్బంది శిక్షణ ఇస్తున్నామన్నారు. టీఎస్‌ఆర్టీసీ రోడ్డు ప్రమాదాల నివారణకు చోళమండలం ఎంఎస్ రిస్క్ సర్వీసెస్ సంస్థ సహకారం తీసుకుంటున్నామని.. వారు డ్రైవర్లకు నాణ్యమైన శిక్షణ అందిస్తారన్నారు. సంస్థ సీవోవో రవీందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్, చోళమండలం ఎంఎస్ రిస్క్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుబ్బారావు, ఓఎస్‌డీ యుగంధర్, ఈడీ యాదగిరి, సీపీఎం కృష్ణకాంత్, ఆర్‌ఎం వెంకన్న పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.