logo

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భారాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. శనివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పలు గ్రామాల్లో ఎండ్లబండ్లు, బతుకమ్మబోనాలు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

Updated : 04 Jun 2023 04:49 IST

దశాబ్ది ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు

శత వసంతాల రామయ్యను సన్మానిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌ తదితరులు

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భారాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. శనివారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పలు గ్రామాల్లో ఎండ్లబండ్లు, బతుకమ్మబోనాలు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నారాయణపూర్‌ గ్రామ పంచాయతీలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న రామయ్యను శాలువతో ఘనంగా సన్మానించారు.
కోట్‌పల్లి, న్యూస్‌టుడే: రైతును రాజుగా చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. శనివారం మండలంలోని బార్వాద్‌, రాంపూర్‌, తొర్మామిడి, బంట్వారం గ్రామాల్లో రైతువేదికల వద్ద ఆయన మాట్లాడారు.
తాండూరు గ్రామీణ: పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు జులై ఒకటో తేదీ నుంచి రూ.3లక్షలను మూడు విడతల్లో చెల్లిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి అన్నారు. తాండూరు మండలం సిరిగిరిపేటలో శనివారం నిర్వహించిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు.రైతు వేదిక వద్ద మాట్లాడారు.
తాండూరు గ్రామీణ: రైతును రాజు చేసిన ఘనత భారాస సర్కారుకు దక్కుతుందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం ఐనెల్లి, చెంగోల్‌లో నిర్వహించిన రైతు దినోత్సవంలో ఎమ్మెలే ఎడ్లబండ్లు, ట్రాక్టర్‌ల ప్రదర్శనలో పాల్గొని మాట్లాడారు.
పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: కేసీఆర్‌ రైతు పక్షపాతి అని, ఈ సర్కారే రైతులకు సాగునీరందిస్తుందని ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు రైతు దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారితో కలిసి ఎండ్ల బండిని తోలుతూ రంగాపూర్‌ రైతువేదికకు చేరుకుని మాట్లాడారు.  
కుల్కచర్ల: రైతులను అన్ని విధాలుగా ఉన్నతిలోకి తీసుకువచ్చేందుకు తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కుల్కచర్ల మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు.
బొంరాస్‌పేట: తెలంగాణలో భారాస అమలు చేస్తున్న   పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం బొంరాస్‌పేట మండల కేంద్రంలోని రైతు వేదికను ప్రారంభిస్తూ మాట్లాడారు. అంతకు ముందు రైతు వేదికల్లో జరిగిన సమావేశాల్లో కొడంగల్‌ ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు.  
నవాబ్‌పేట: సీఎం కేసీఆర్‌ రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకు వచ్చి రైతు బాంధవుడయ్యాడని శాసనసభ్యులు కాలె యాదయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని చించల్‌పేట గ్రామంలో రైతు ఉత్సవంలో పాల్గొని మాట్లాడారు.  
కొడంగల్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించి మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని