logo

కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి.. వివాహితపై లైంగికదాడి

కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి వివాహితకు తాగించి లైంగిక దాడికి పాల్పడటంతోపాటు నగ్న వీడియోలు, ఫొటోలు తీసి బాధితురాలిని బ్లాక్‌మెయిల్‌ చేశాడో ప్రబుద్ధుడు.

Updated : 04 Aug 2023 06:40 IST

నగ్న వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులు
ఏపీలో జీరో ఎఫ్‌ఐఆర్‌, మధురానగర్‌ ఠాణాకు బదిలీ

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి వివాహితకు తాగించి లైంగిక దాడికి పాల్పడటంతోపాటు నగ్న వీడియోలు, ఫొటోలు తీసి బాధితురాలిని బ్లాక్‌మెయిల్‌ చేశాడో ప్రబుద్ధుడు. ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకోగా బాధితురాలు ఆంధ్రప్రదేశ్‌లోని సొంతూరుకు వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం అక్కడి ఠాణాకు చేరడంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఇక్కడి మధురానగర్‌ ఠాణాకు బదిలీ చేశారు. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన బాధితురాలికి ఆన్‌లైన్‌ గేమింగ్‌లో ఏపీకి చెందిన జాషువా, వాసాకుమార్‌ నర్సింహమూర్తి పరిచయమయ్యారు. ఈక్రమంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న జాషువాను ఆమె 2020 జూన్‌ 10న పెళ్లి చేసుకుంది. ఇది నచ్చని నర్సింహమూర్తి ఆమె వెంటపడటం ప్రారంభించాడు. ప్రేమిస్తున్నానని ఫోన్‌లో సందేశాలు పంపేవాడు. తరచూ ఫోన్‌ చేస్తుండటంతో భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో బాధితురాలు ఉద్యోగం చేస్తానని నగరానికి వచ్చి బల్కంపేటలో తన స్నేహితురాలి ఫ్లాట్‌కు వచ్చింది. ఇది తెలిసిన నర్సింహమూర్తి ఆమె దగ్గరకు వచ్చాడు. భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి అమీర్‌పేట్‌లోని ఓ వసతిగృహంలో చేర్పించాడు. అంతేకాకుండా రహ్మత్‌నగర్‌ పరిధి జవహర్‌నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకున్నాడు. బాధితురాలిని అక్కడికి పిలిపించి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఆమెతో తాగించాడు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వీడియోలు, ఫొటోలు తీశాడు. అనంతరం బెదిరింపులు ప్రారంభించాడు. దీంతో స్వగ్రామానికి వెళ్లిన బాధితురాలు గతనెల 7న అక్కడ ఆత్మహత్యాయత్నం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు