logo

మజ్లిస్‌ అభ్యర్థులు వీరే

మజ్లిస్‌ అభ్యర్థులు

Updated : 04 Nov 2023 05:28 IST
  •  నియోజకవర్గం
  •  అభ్యర్థి
  •  వయసు
  •  విద్యార్హత
  •  వృత్తి
  •  రాజకీయ నేపథ్యం

  • మలక్‌పేట
  • అహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా బలాల
  • 56 సంవత్సరాలు
  • ఎస్‌ఎస్‌సీ
  • విద్యాసంస్థలు
  • 2004లో పత్తర్‌గట్టీ కార్పొరేటర్‌గా గెలిచారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో మలక్‌పేట నుంచి విజయం సాధించారు. నాలుగోసారి బరిలో నిలుస్తున్నారు.

  • నాంపల్లి
  • మహ్మద్‌ మాజిద్‌ హుస్సేన్‌
  • 43 ఏళ్లు
  • ఎంబీఏ 5. వ్యాపారం
  • మజ్లిస్‌ పార్టీ ఇతర రాష్ట్రాల బాధ్యుడు. 2009లో మజ్లిస్‌ తరఫున అహ్మద్‌నగర్‌ డివిజన్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2012-2014 వరకు గ్రేటర్‌ మేయర్‌గా కొనసాగారు. 2016, 2020 గ్రేటర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ అభ్యర్థిగా మెహిదీపట్నం డివిజన్‌ కార్పొరేటర్‌గా విజయం సాధించారు.

  • కార్వాన్‌
  • కౌసర్‌ మొహియుద్దీన్‌
  • 59
  • ఇంటర్మీడియట్‌
  • పూర్తిస్థాయి రాజకీయం  
  • 2014, 2018లో మజ్లిస్‌ పక్షాన కార్వాన్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మూడు దశాబ్దాలకు పైగా పార్టీ కార్యకర్తగా, నాయకునిగా ఉన్నారు.

  • చార్మినార్‌
  • మీర్‌ జుల్ఫీకర్‌ అలీ  
  • 60    
  • బీఎస్సీ  5. స్థిరాస్తి వ్యాపారం
  • చార్మినార్‌లోని చార్‌మహల్‌ కార్పొరేటర్‌గా 1986లో విజయం సాధించారు. 2009లో హుస్సేనిఆలం కార్పొరేటర్‌గా గెలుపొందారు. అతి పిన్నవయసులో 26వ ఏటా హైదరాబాద్‌ మేయర్‌గా ఎంపికయ్యారు. 1991 నుంచి 95 వరకు, మళ్లీ 1999-2002 వరకు పనిచేశారు.

  • యాకుత్‌పుర
  • జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌
  • 63
  • ఇంటర్‌
  • వ్యాపారం
  • 2009 నుంచి 2012 వరకు గ్రేటర్‌ డిప్యూటీ మేయర్‌, 2014, 2018లో నాంపల్లి ఎమ్మెల్యే.

  • చాంద్రాయణగుట్ట
  • అక్బరుద్దీన్‌ ఒవైసీ
  • 53
  • ఎంబీబీఎస్‌
  • వ్యాపారం
  • మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సోదరుడు.  1999 ఎన్నికల్లో మొదటి సారి మజ్లిస్‌ తరఫున చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేసి, అప్పటి రాజకీయ కురువృద్ధుడు, ఎంబీటీ వ్యవస్థాపకుడు అమానుల్లాఖాన్‌పై విజయం సాధించారు. 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో సైతం వరుస విజయాలు నమోదు చేశారు. శాసనసభలో మజ్లిస్‌ పక్ష నేతగా ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని