logo

Hyderabad: వరల్డ్‌కప్‌ ఫైనల్‌.. హోటళ్లలో భారీ తెరలు, ప్రత్యేక రాయితీలు

ప్రపంచ కప్‌ క్రికెట్‌లో భారత్‌-ఆసీస్‌ మధ్య తుదిపోరు వీక్షణకు నగరం సిద్ధమైంది.

Updated : 19 Nov 2023 10:45 IST

జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌లో ఏర్పాటు చేసిన భారీ తెర

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ప్రపంచ కప్‌ క్రికెట్‌లో భారత్‌-ఆసీస్‌ మధ్య తుదిపోరు వీక్షణకు నగరం సిద్ధమైంది. ఒకవైపు ఎన్నికల కోలాహలం ఉన్నప్పటికీ అభిమానుల కోసం నగరంలోని పబ్బులు, క్లబ్బులు, హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. వీక్షకుల కోసం భారీ తెరలను అందుబాటులోకి తెచ్చాయి. మధ్యాహ్నం నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మ్యాచ్‌ సమయానికి ముగించేలా ప్రణాళికలు వేసుకున్నారు. మరోవైపు ఆతిథ్య కేంద్రాల్లో యువకులు పెద్దఎత్తున బుకింగ్‌ చేసుకున్నారు.

అందరూ కలిసి చూసేలా..

జూబ్లీహిల్స్‌లోని నెక్టార్‌ కిచెన్‌ను 150 మంది ముందస్తుగానే బుక్‌ చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. అమ్నీషియా, ఫర్జీ కేఫ్‌, వయోలా, హార్ట్‌ కప్‌, హలో తదితర పబ్‌లు, పలు హోటళ్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రత్యేక ఆఫర్‌లను ప్రకటించాయి. ప్రపంచకప్‌ను భారత్‌ గెలిస్తే బిల్లులో రాయితీ ఇస్తామని ఓ పబ్‌ నిర్వాహకుడు తెలిపారు.  

నాయకులకు అభ్యర్థనలు..

మంత్రి కేటీఆర్‌ తన ఎన్నికల ప్రసంగంలో క్రికెట్‌ను తరచూ ప్రస్తావిస్తున్నారు. భారత్‌ ప్రపంచ కప్‌, భారాస ఎన్నికల్లో గెలవడం ఖాయమంటూ చెబుతున్నారు. కోహ్లి వంద కొట్టాడు, మనమూ వంద సీట్లు కొడదామా.. అంటూ ఉత్సాహపరిచారు. ఈ నేపథ్యంలో యువకులు భారీతెరలు ఏర్పాటు చేయాలని అభ్యర్థులను కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని