logo

లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లు షురూ

లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ప్రారంభమైన పదిరోజుల వరకూ ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల వివరాలు, ఇతర అంశాలను పర్యవేక్షించిన హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను మొదలు పెట్టారు.

Published : 27 Mar 2024 02:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ప్రారంభమైన పదిరోజుల వరకూ ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల వివరాలు, ఇతర అంశాలను పర్యవేక్షించిన హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను మొదలు పెట్టారు. చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సిబ్బంది తొలి ర్యాండమైజేషన్‌ ప్రక్రియను కలెక్టర్లు శశాంక, గౌతమ్‌లు మంగళవారం చేపట్టారు. హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి నిజాం కళాశాలలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంల భద్రతను, స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. అక్కడ సీసీ కెమెరాలు, మూడంచెల భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వహించనున్న ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి నేతృత్వంలో శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

అధికారులకు విధుల కేటాయింపు : పోలింగ్‌ అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్‌రాస్‌ ఆదేశించారు. ఉద్యోగులు, సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను ఆయన మంగళవారం తన కార్యాలయంలో చేపట్టారు. జిల్లా పరిధిలోని రెండు ఎంపీ నియోజకవర్గాల పరిధిలో 3,986 పోలింగ్‌ కేంద్రాలున్నాయన్నారు. సిబ్బందికి ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, పోస్టల్‌ బ్యాలెట్‌ను అందించి ఓటేసే ప్రక్రియపై అవగాహన కల్పించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని