logo

సాంకేతిక లోపంతో ఆగిన మెట్రో

సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ స్టేషన్‌లో బుధవారం ఉదయం  15 నిమిషాలపాటు మెట్రోరైలు ఆగింది.

Published : 28 Mar 2024 02:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ స్టేషన్‌లో బుధవారం ఉదయం  15 నిమిషాలపాటు మెట్రోరైలు ఆగింది. ఉదయం కార్యాలయాలకు హడావుడిగా వెళ్లే సమయంలో పావుగంట నిలిచిపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత సమస్యను పరిష్కరించడంతో యథావిధిగా మెట్రోరైళ్లు నడిచాయి.

క్రికెట్‌ సందర్భంగా అర్ధరాత్రి వరకు.. : ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోరైలు వేళల్ని అర్ధరాత్రి వరకు నడిచాయి. సాధారణంగా రాత్రి 11 గంటలకే నడుస్తాయి. మ్యాచ్‌ ముగిశాక ప్రేక్షకులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా టర్మినల్‌ స్టేషన్‌ నుంచి చివరి మైట్రోరైళ్లు 12.15 గంటలకు బయలుదేరాయి. నాగోల్‌, ఉప్పల్‌, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచే ఈ సదుపాయం కల్పించారు. చివరి స్టేషన్‌కు 1.10 గంటలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని