logo

అంధులు.. చదరంగంలో ఎత్తులు

దేవనార్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ ఆధ్వర్యంలో బేగంపేట  లోని దేవనార్‌ పాఠశాలలో ఫిడే రేటింగ్‌ జాతీయ ఓపెన్‌ చదరంగం పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి.

Updated : 03 May 2024 04:10 IST

దేవనార్‌ పాఠశాలలో ఆడుతున్న అంధులు

బేగంపేట: దేవనార్‌ ఫౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ ఆధ్వర్యంలో బేగంపేట  లోని దేవనార్‌ పాఠశాలలో ఫిడే రేటింగ్‌ జాతీయ ఓపెన్‌ చదరంగం పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 245 మంది 6 నుంచి 70 ఏళ్లలోపు అంధులు పాల్గొన్నారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బి.పి.ఆచార్య క్రీడాకారులను అభినందించారు. అత్యుత్తమ పాయింట్లు సాధించిన మొదటి 15 మందికి నగదు ప్రోత్సాహకంతోపాటు ట్రోఫీని అందిస్తామని నిర్వాహకులు ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డా.ఎ.సాయిబాబాగౌడ్‌, సహ వ్యవస్థాపకురాలు డా.జ్యోతిగౌడ్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని