logo

ఆ నాలుగూ ఇక్కడే. అధికారులకు సవాలే

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలూ రాజధానిలోనే ఉండడం గమనార్హం.

Updated : 06 May 2024 05:36 IST

లక్షమందికిపైగా ఎన్నికల ఉద్యోగులు.. సిబ్బంది
రాజధానిలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజక వర్గాలు
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలూ రాజధానిలోనే ఉండడం గమనార్హం. దీంతో ఎన్నికల అధికారులు నిద్రాహారాలు లేకుండా పోలింగ్‌ కేంద్రాలు.. ఈవీఎంలను సిద్ధం చేస్తున్నారు. అధికసంఖ్యలో ఓటర్లతోపాటు అభ్యర్థులు కూడా ఎక్కువమంది పోటీచేస్తుండడంతో ఈవీఎంలు కూడా అదనంగా సమకూర్చుకుంటున్నారు. పోలింగ్‌ సజావుగా, ప్రశాంతంగా కొనసాగేందుకు వీలుగా లక్షమందికిపైగా ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

అత్యధిక ఓటర్లు వరుసగా..

మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గంలో మొత్తం 37.80లక్షల మంది ఓటర్లున్నారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నియోజకవర్గంగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. రెండో స్థానంలో చేవెళ్ల 29.39లక్షలు, మూడో స్థానంలో హైదరాబాద్‌ 22.17లక్షలు, నాలుగో స్థానంలో సికింద్రాబాద్‌ 21.20లక్షలు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి.

  • రాష్ట్రంలోని 17నియోజవర్గాల్లో మొత్తం 3.32 కోట్ల మంది ఓటర్లుండగా.. ఇందులో 1.10కోట్ల మంది ఓటర్లు హైదరాబాద్‌ పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో పురుష ఓటర్ల సంఖ్య 19.45లక్షలు కాగా.. రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలోనూ స్త్రీ, పురుష ఓటర్లు కలిపినా 19.45లక్షల మంది లేరు.
  • హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం స్టాండ్‌బైగా 30శాతం మందిని వేర్వేరు విభాగాలు, శాఖల నుంచి తీసుకున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా అనారోగ్య సమస్యలున్నవారు చివరి నిముషంలో ఎన్నికల విధులకు గైర్హాజరైనా సరిపోతుందున్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • రాష్ట్రంలోనే అత్యధికంగా సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి 46మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజవర్గ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మూడు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే అధికంగా మహిళా ఓటర్లున్నారు.

ఓటర్లు ఇక్కడ.. ఇలా...

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని