logo

చేయి చేయి కలిపి.. చెయ్యెత్తి కదిలి

అడుగడుగున హారతులు.. బతుకమ్మ ఆటలు.. లంబాడీ నృత్యాలు.. సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షోలో ఎటుచూసినా జనసందోహమే. సోమవారం రాత్రి కంటోన్మెంట్‌, అంబర్‌పేట, ఉప్పల్‌ పరిధిలో ఆయన రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు.

Published : 07 May 2024 02:20 IST

కార్ఖానా, కంటోన్మెంట్‌, ఉప్పల్‌, అంబర్‌పేట, న్యూస్‌టుడే: అడుగడుగున హారతులు.. బతుకమ్మ ఆటలు.. లంబాడీ నృత్యాలు.. సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షోలో ఎటుచూసినా జనసందోహమే. సోమవారం రాత్రి కంటోన్మెంట్‌, అంబర్‌పేట, ఉప్పల్‌ పరిధిలో ఆయన రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. పికెట్‌లో సీఎం మాట్లాడుతూ..కంటోన్మెంట్‌లో పేదలకు హక్కులు కల్పిస్తా పేర్కొన్నారు. ‘‘ఇక్కడి వారిపై ఆర్మీ వాళ్ల పెత్తనముంది. రాత్రివేళల్లో గేట్లు బంద్‌ చేస్తారు. వారికి ఇష్టం వచ్చినప్పుడు రహదారులను మూసేస్తారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో మాట్లాడి ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అనుమతులు తీసుకువచ్చాం. బోర్డును బల్దియాలో విలీనం చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నాం’’ అని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సునీతా మహేందర్‌రెడ్డి, శ్రీగణేష్‌, వీహెచ్‌, మైనంపల్లి తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని