logo

ప్రధాని నరేంద్రమోదీని కలిసిన డాక్టర్‌ రఘురాం

కిమ్స్‌- ఉషాలక్ష్మి రొమ్ము కేన్సర్‌ చికిత్స కేంద్రం డైరెక్టర్‌, ప్రముఖ కేన్సర్‌ వైద్యుడు డాక్టర్‌ రఘురాం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారం ఇక్కడ రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.

Published : 09 May 2024 02:01 IST

రాజ్‌భవన్‌లో పీఎం నరేంద్రమోదీతో డాక్టర్‌ రఘురాం దంపతులు
ఈనాడు, హైదరాబాద్‌: కిమ్స్‌- ఉషాలక్ష్మి రొమ్ము కేన్సర్‌ చికిత్స కేంద్రం డైరెక్టర్‌, ప్రముఖ కేన్సర్‌ వైద్యుడు డాక్టర్‌ రఘురాం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మంగళవారం ఇక్కడ రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న రొమ్ము కేన్సర్‌, చికిత్సలు ఇతర అంశాలపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు డాక్టర్‌ రఘురాం బుధవారం మీడియాకు తెలిపారు. వైద్య చికిత్సలకు డబ్బు వెచ్చించలేని ఎంతోమంది పేదలు, వృద్ధులు, ఇతర వర్గాలకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకం అండగా నిలుస్తోందని పీఎం దృష్టికి తీసుకెళ్లారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో భాగంగా దేశ వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ మహిళలకు స్క్రీనింగ్‌ ద్వారా ముందే రొమ్ము కేన్సర్‌ను గుర్తించవచ్చునని, బ్రెస్ట్‌ కేన్సర్‌ రిజిస్ట్రీ కోసం కూడా ఉపయోగపడుతుందని వివరించారు. ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ కేన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వెలువడే హెల్త్‌ మ్యాగజైన్‌ ‘పింక్‌ కనెక్షన్‌’ ఎడిటోరియల్‌ పేజీపై ప్రధాని ఆటోగ్రాఫ్‌ చేసి డాక్టర్‌ రఘురాంను అభినందించారు. డాక్టర్‌ వైజయంతి వెంట ఉన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని