icon icon icon
icon icon icon

లష్కర్‌ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు

సికింద్రాబాద్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్‌..

Published : 10 May 2024 14:59 IST

పి.శివశంకర్‌, టి.అంజయ్య, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో   జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్‌.. అనంతరం కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. 1984 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి పోటీచేసి విజేతగా నిలిచిన టి.అంజయ్య కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1991, 1998, 1999, 2014 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా గెలుపొందిన బండారు దత్తాత్రేయ.. రైల్వే శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా, కేంద్ర కార్మిక శాఖమంత్రిగా సైతం పనిచేశారు. 2019లో ఇక్కడి నుంచి భాజపా అభ్యర్థిగా గెలుపొందిన కిషన్‌రెడ్డి తొలుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా, ప్రస్తుతం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రిగా ఉన్నారు.

న్యూస్‌టుడే, బర్కత్‌పుర

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img