logo

కబ్జాదారుల కట్టడికి చర్యలేవీ?

కడప నగరంలో కబ్జాదారుల అక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నా అధికార యంత్రాంగం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తోందని సీపీఎం నాయకుడు నారాయణ విమర్శించారు. భూకబ్జాలు, ఆక్రమణలను నిరసిస్తూ అఖిలపక్ష నేతలు శనివారం కార్పొరేషన్‌

Published : 22 May 2022 04:06 IST


రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం నాయకుడు నారాయణ

అరవిందనగర్‌(కడప), న్యూస్‌టుడే : కడప నగరంలో కబ్జాదారుల అక్రమాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నా అధికార యంత్రాంగం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తోందని సీపీఎం నాయకుడు నారాయణ విమర్శించారు. భూకబ్జాలు, ఆక్రమణలను నిరసిస్తూ అఖిలపక్ష నేతలు శనివారం కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవానీనగర్‌లో 40 ఏళ్లుగా మట్టి రోడ్డు ఉందని దస్త్రాలు చెబుతున్నాయని, ఇదేమిని అధికారులను ప్రశ్నిస్తే వితండవాదాలు చేస్తుండటం బాధాకరమన్నారు. అధికారులు చేసిన పొరపాట్లను సరిచేసి కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని, లేదంటే ఐకాస ఆధ్వర్యంలో కార్పొరేషన్‌ను ముట్టడించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీసీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, పీసీసీ కార్యదర్శి సత్తార్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గుర్రప్ప, తెదేపా కడప బాధ్యుడు అమీర్‌బాబు, వ్యవసాయ కార్మిక, రైతు సంఘం నాయకులు వెంకటేశు, అన్వేష్, దస్తగిరిరెడ్డి, ఉక్కు సాధన సమితి కన్వీనర్‌ ఓబులేసు తదితరులు ప్రసంగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని