logo
Updated : 31 Oct 2021 07:03 IST

ఉపపోరులో ఇదో విచిత్రం.. ఓటువేసే అవకాశం దక్కని 20 మంది అభ్యర్థులు

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు ఇక్కడ ఓటు వేయలేని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 10 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగరావు(హైదరాబాద్‌)తో సహా 19 మంది అభ్యర్థులు స్థానికేతరులు కావడంతో ఓటు వేసే అవకాశం దక్కలేదు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో సహా ఆయన కుటుంబసభ్యులు వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్‌లో ఓటు వేశారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌, ఆయన కుటుంబ సభ్యులు కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న కేశెట్టి విజయ్‌కుమార్‌(హుజూరాబాద్‌), దేవునూరి శ్రీనివాస్‌(వీణవంక- కోర్కల్‌), సిలివేరు శ్రీకాంత్‌(జమ్మికుంట), పల్లె ప్రశాంత్‌(కన్నూరు, కమలాపూర్‌), మ్యాకమల్ల రత్నయ్య(మడిపల్లి-జమ్మికుంట), మౌటం సంపత్‌(కమలాపూర్‌), శనిగరపు రమేశ్‌బాబు(కమలాపూర్‌), రావుల సునిల్‌(కన్నూరు-కమలాపూర్‌) తమతమ ఓట్లు వేశారు. అన్నా వైస్సార్‌ పార్టీ అభ్యర్థి మన్సూర్‌ అలీ మహ్మద్‌(నిజామాబాద్‌)తో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచిన కన్నం సురేష్‌కుమార్‌(హైదరాబాద్‌), కర్ర రాజిరెడ్డి(శాయంపేట), లింగిడి వెంకటేశ్వర్లు(సూర్యాపేట), ఉప్పు రవీందర్‌(కరీంనగర్‌), ఉరుమల్ల విశ్వం(కరీంనగర్‌), ఎడ్ల జోగిరెడ్డి(తిమ్మాపూర్‌), కుమ్మరి ప్రవీణ్‌(కరీంనగర్‌), కోట శ్యాంకుమార్‌(కరీంనగర్‌), కంటె సాయన్న(మేడ్చల్‌), గుగులోతు తిరుపతి(సైదాపూర్‌), గంజి యుగంధర్‌(పర్వతగిరి), చాలిక చంద్రశేఖర్‌(కూకట్‌పల్లి), చిలుక ఆనంద్‌(జూలపల్లి), పిడిశెట్టి రాజు(కోహెడ), బుట్టెంగారి మాధవరెడ్డి(మేడ్చల్‌), లింగంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి(శంకరపట్నం), వేముల విక్రంరెడ్డి(ధర్మపురి), సీవీ సుబ్బారెడ్డి(కూకట్‌పల్లి) స్థానికేతరులు కావడంతో వారంతా ఇక్కడ ఓటు వేయలేదు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని