logo
Published : 30/11/2021 03:21 IST

చంపేసి.. ఆధారాలు చేరిపేసి!

హత్యోదంతం బయటపడకుండా పన్నాగం

రెండు రోజుల్లోనే నిందితుడి అరెస్టు

న్యూస్‌టుడే, గోదావరిఖని-జ్యోతినగర్‌

నా పేరు రాజు.. ఇది సినిమా పేరు కాదు.. నిజ సంఘటన.. ఇలాంటిది సినిమాల్లోనే చూసుంటారు. ఒక మనిషిని చంపిన తర్వాత ఆధారాల్లేకుండా చేసేందుకు ఓ నిందితుడు సినిమా సన్నివేశాలను ఎంచుకున్నాడు. తను చేసిన హత్యకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనుకున్నాడు. కానీ, నిజ జీవితంలో అలాంటిది సాధ్యం కాదన్న విషయం తేలిపోయింది. హత్యా నేరం బయటపడటంతో రెండు రోజుల్లోనే కటకటాల పాలయ్యాడు.

ఎన్టీపీసీ ఠాణా పరిధిలోని ఖాజీపల్లికి చెందిన కాంపల్లి శంకర్‌ను హత్య చేసిన నిందితుడు పొయ్యిల రాజు ఆధారాల్లేకుండా చేసేందుకు ‘నా పేరు శివ’ సినిమా సన్నివేశాలను ఎంచుకున్నాడు. మృతదేహాన్ని ఏడు ముక్కలుగా చేశాడు. ఒక్కో భాగాన్ని ఒక్కో ప్లాస్టిక్‌ సంచిలో మూటగట్టాడు. ఒక్కో భాగాన్ని వేరువేరు మార్గాల్లో తీసుకెళ్లి పడేశాడు. అంతటితో తన హత్యోదంతం బయటకు రాదని భావించాడు. కానీ, రెండు రోజుల్లోనే కటకటాల పాలయ్యాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడు. సినిమాలోని సన్నివేశాలను చూసి మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు ఒప్పుకున్నాడు. వాటిని వేరువేరు ప్రాంతాల్లో పడేసినట్లు విచారణలో వెల్లడించాడు నిందితుడు. శంకర్‌ను హత్య చేసిన రాజు ఇంట్లో ఒక్క ఆధారం లభించకుండా రసాయనాలు వినియోగించి ఇంటిని శుభ్రం చేశాడు. హతుని దుస్తులు కనిపించకుండా కాల్చేశాడు. హత్యకు గురైన శంకర్‌ శరీర భాగాలను కూడా రసాయనాలతో శుభ్రం చేసి సంచిలో మూటగట్టి బయట పడేశాడు. అనేక జాగ్రత్తలు తీసుకున్న నిందితుడు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు.


హత్యోదంతంపై అనేక ప్రశ్నలు

మీసేవ ఆపరేటర్‌ కాంపల్లి శంకర్‌ హత్య సంఘటనలో అనేక ప్రశ్నలు మిగిలిపోయాయి. పోలీసులు చెప్పిన కథనానికి వాస్తవ పరిస్థితులకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. కొన్ని ప్రశ్నలకు అసలు సమాధానాలు లేకుండా పోయాయి. శంకర్‌ను రాజు ఒక్కడే హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు చెబుతున్న పోలీసులు మృతదేహంలోని శరీర భాగాలను ఒంటరిగా తరలించాడంటేనే నమ్మకం కుదరడం లేదు. సాధారణంగా చనిపోయిన తర్వాత మృతదేహం బరువు ఎక్కువగా ఉంటుంది. కాళ్లు, చేతులు, తల భాగాలను ఒక్కరు తీసుకెళ్లి పడేసే అవకాశం ఉంది. కాని తల నుంచి నడుము వరకు ఉన్న శరీర భాగాన్ని ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి తీసుకెళ్లడం ఏ విధంగా సాధ్యమవుతుందన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. పెద్దపల్లి వెళ్లే సమయంలో టోల్‌ఫ్లాజా వద్ద ద్విచక్ర వాహనంపై ఒక్కడే వెళ్తున్నట్లు సీసీ పుటేజీలో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. శంకర్‌కు సంబంధించిన సెల్‌ఫోన్‌ను ఇంకా స్వాధీనం చేసుకోలేదు. మరీ అతని సెల్‌ఫోన్‌ ఎక్కడ పోయింది. నిందితుడే పడేశాడా...? అన్నది ఎందుకు చెప్పలేదు. మృతుని శరీర భాగాలు ఎక్కడ పడేసింది చెప్పిన నిందితుడు సెల్‌ఫోన్‌ విషయాన్ని ఎందుకు దాస్తున్నాడు. శంకర్‌ను హత్య చేసిన రాత్రి అతని భార్యకు నిందితుడు ఫోన్‌ చేశాడా..? అన్నది సందేహంగా ఉంది. ఉదయమే వెళ్లి ఆమెకు ఈ విషయాన్ని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి ఈ విషయాన్ని ఫోన్‌లో చెప్పకుండా ఆమెను నేరుగా కలిసి హత్యోదంతాన్ని ఎందుకు చెప్పాడు. పథకం ప్రకారం హత్య చేయలేదని, యాదృచ్ఛికంగానే హతమార్చినట్లు పోలీసులు చెపుతున్నారు. అతని వద్ద రసాయనాలు.. సర్జికల్‌ బ్లేడులు ఎందుకున్నాయి. ఆస్పత్రిలో పనిచేస్తుండటంతో వాటిని తెచ్చి పెట్టుకున్నాడనుకున్నా అతనికి ముందే ఈ హత్య చేయాలన్న ఆలోచన ఉండి ఉంటుందనేది తెలుస్తోంది. మొత్తానికి శంకర్‌ హత్య వెనుక అనేక ప్రశ్నలు ఇంకా మగిలే ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. ఇందులో ఇంకా ఎవరి ప్రమేయం ఉందన్న విషయాన్ని విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించడంతో మరి కొన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు మాత్రం వినిపిస్తున్నాయి.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని