logo

భానుడి భగభగ

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్‌ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి.

Updated : 25 Apr 2024 06:36 IST

చున్నీలు కప్పుకొని వెళ్తున్న విద్యార్థినులు

జగిత్యాల ధరూర్‌క్యాంపు, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్‌ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 44.8, కొత్తగట్టులో 44.3 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డుకాగా పెద్దపల్లి జిల్లా మంథనిలో 44.2, జగిత్యాల జిల్లా గోధూరులో 43.7, రాజన్న సిరిసిల్ల జిల్లా మర్తనపేటలో 42.9 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని, అకాల వర్షసూచన ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని