logo

భాజపా బీఫామ్‌ ఎవరికో!

నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్‌ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

Published : 25 Apr 2024 04:18 IST

రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసిన ఎంపీ వెంకటేశ్‌నేత
రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించిన గోమాసె

ఈనాడు, పెద్దపల్లి: నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్‌ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం పార్టీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, హరీశ్‌బాబు తదితరులతో కలిసి మరో సెట్టు నామినేషన్‌తో పాటు బీఫామ్‌ సమర్పిస్తానని చెప్పారు. మరోవైపు సిట్టింగ్‌ ఎంపీ వెంకటేశ్‌నేత బుధవారం హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగలతో అంతర్గతంగా సమావేశమైనట్లు తెలిసింది. పెద్దపల్లి టికెట్‌ ఇస్తే భాజపాలో చేరతానని ఎంపీ స్పష్టం చేయడంతో ఈ విషయమై అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో గోమాసె, వెంకటేశ్‌నేతలలో ఎవరికి పార్టీ బీఫామ్‌ దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఇదంతా దుష్ప్రచారమేనని గోమాసె పేర్కొంటుండగా, నామినేషన్ల చివరి రోజైన గురువారం వెంకటేశ్‌నేతకు కూడా బీఫామ్‌ కూడా ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వెంకటేశ్‌నేత మీడియాకు అందుబాటులో లేకుండా, పార్టీ నేతల అంచనాలకు చిక్కకుండా గోప్యత పాటిస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా గురువారం సాయంత్రంలోగా దీనికి తెర పడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని