logo

ఈవీఎం కమిషనింగ్‌ పూర్తి చేయాలి

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రామగుండం నియోజకర్గం పరిధిలో నిర్వహించే ఓటింగ్‌కు సంబంధించి ఈవీఎం కమిషనింగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌, పెద్దపల్లి ఎన్నికల అధికారి ముజమ్మిల్‌ఖాన్‌ సోమవారం పరిశీలించారు.

Published : 07 May 2024 02:16 IST

వివరాలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, చిత్రంలో అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ 
గోదావరిఖని, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రామగుండం నియోజకర్గం పరిధిలో నిర్వహించే ఓటింగ్‌కు సంబంధించి ఈవీఎం కమిషనింగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌, పెద్దపల్లి ఎన్నికల అధికారి ముజమ్మిల్‌ఖాన్‌ సోమవారం పరిశీలించారు. ఎన్టీపీసీ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూం, ఈవీఎం యంత్రాల కమిషనింగ్‌ ప్రక్రియ పనులను ఆయన అదనపు కలెక్టర్‌, సహాయ ఎన్నికల అధికారిణి అరుణశ్రీతో కలిసి పరిశీలించారు. రామగుండం నియోజకవర్గంలో మొత్తం 260 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ కుమారస్వామి, ఇతర అధికారులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని