logo

ప్రచార ఖర్చులు విధిగా సమర్పించాలి

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార ఖర్చుల వివరాలను విధిగా సమర్పించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ తెలిపారు.

Published : 07 May 2024 02:21 IST

అభ్యర్థులు, ఏజెంట్లతో మాట్లాడుతున్న ఎన్నికల వ్యయ పరిశీలకుడు సమీర్‌ నైరంతర్యా
పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచార ఖర్చుల వివరాలను విధిగా సమర్పించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ తెలిపారు. సమీకృత పాలనా ప్రాంగణంలో సోమవారం అభ్యర్థులు, ఏజెంట్లతో నిర్వహించిన రెండో విడత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రోజువారీగా ఖర్చులను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. మరోసారి ఈ నెల 11న నిర్వహించనున్నామని వెల్లడించారు. 42 మంది అభ్యర్థులకు సంబంధించి 36 మంది అభ్యర్థులు, వారి ఏజెంట్లు హాజరయ్యారని తెలిపారు. హాజరుకాని అభ్యర్థులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు వివరించారు. జిల్లా సహకార అధికారి శ్రీమాల, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు