logo

‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విమానాశ్రయం ఆలస్యం’

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యం అయిందని, ప్రతిపాదిత భూమిని అప్పగిస్తే ఏడాదిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ పేర్కొన్నారు.

Published : 08 May 2024 05:11 IST

జక్రాన్‌పల్లిలో మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్‌, చిత్రంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి

జక్రాన్‌పల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యం అయిందని, ప్రతిపాదిత భూమిని అప్పగిస్తే ఏడాదిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్‌ పేర్కొన్నారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం, వైద్యం అందిస్తోందని, ఏటా రూ.6 వేలు రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో వేస్తున్నామని గుర్తుచేశారు. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఇందూర్‌ గడ్డ మీదే ఏర్పాటు చేస్తామని అమిత్‌షా స్పష్టం చేసినా కాంగ్రెస్‌, భారాస నాయకులు ఏదీ అని ఇంకా అడగటం విడ్డూరంగా ఉందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేసిన ప్రధాని ముస్లిం మహిళలకు మేలు చేశారన్నారు. రైతులకు రూ.500 బోనస్‌ ఇవ్వడం చేతకాని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ ఎలా చేస్తుందని ప్రశ్నించారు. యూనిఫాం సివిల్‌కోడ్‌ అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తాలిబన్ల చేతికి పాలన వెళ్లిపోతుందన్నారు. భారాస అధినేత కేసీఆర్‌ విలాసవంతమైన బస్సులో టూర్‌కు వచ్చినట్లుగా ఉందని, పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ఎద్దేవా చేశారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు కిషన్‌ నాయక్‌, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు కోటపాటి నర్సిహం నాయుడు, వకీల్‌ గంగారెడ్డి, మోహన్‌నాయక్‌, జైడి గంగారెడ్డి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు