logo

హుషారుగా వచ్చి.. ఉసురుమంటూ!

కరీంనగర్‌లో మంగళవారం నిర్వహించాల్సిన సభ గాలివాన బీభత్సంతో రద్దు అయింది. సభాస్థలి వద్ద పరిస్థితి చిన్నాభిన్నమైంది. గాలులకు సభావేదిక వద్ద వేసిన టెంట్లు కుప్పకూలాయి.

Published : 08 May 2024 05:12 IST

సభ రద్దుతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నిరుత్సాహం

సభావేదిక వద్ద కూలిన టెంట్లు, చెల్లాచెదురైన కుర్చీలు

కరీంనగర్‌ పట్టణం, సుభాష్‌నగర్‌, న్యూస్‌టుడే : కరీంనగర్‌లో మంగళవారం నిర్వహించాల్సిన సభ గాలివాన బీభత్సంతో రద్దు అయింది. సభాస్థలి వద్ద పరిస్థితి చిన్నాభిన్నమైంది. గాలులకు సభావేదిక వద్ద వేసిన టెంట్లు కుప్పకూలాయి. కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. సీఎం పర్యటన రద్దు కావడంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. సభాస్థలికి వచ్చిన మహిళలు వర్షంలో తడిచారు. కొందరు గొడుగులు పట్టుకున్నారు. హెలిక్యాప్టర్‌లో సీఎం వచ్చే పరిస్థితి లేకపోవడంతో స్థానిక నేతలు సమావేశాన్ని నిర్వహించేవిధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. నియోజకవర్గం నుంచి జనాలు వాహనాల్లో వస్తుండటంతో వారిని ఎస్సారార్‌ కళాశాల మైదానానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే మరోసారి వర్షం కురవడంతో సభావేదిక వద్దకు వచ్చిన కార్యకర్తలు ప్రజలు అక్కడి నుంచి పరుగులు పెట్టి చెట్ల చెంతన, దుకాణాల వద్ద నిలబడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు