logo
Published : 28/11/2021 00:54 IST

సింధు..బంగారు కొండ

గవర్నర్‌ నుంచి బంగారు పతకం అందుకుంటున్న సింధు

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లిలో సాధారణ రైతు కుటుంబానికి చెందిన కె.సింధు ఎమ్మెస్సీ పుష్ప కృషి ఉద్యాన కళాశాస్త్రంలో 9.21 గ్రేడ్‌ పాయింట్లు పొంది బంగారు పతకం సాధించారు. శివమొగ్గ కెళది శివప్పనాయక కృషి ఉద్యాన విజ్ఞాన విశ్వవిద్యాలయంలో 25న జరిగిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ సింధుకు బంగారు పతకం అందించారు. కంప్లి కె.మహాబలేశ్వర సుజాత దంపతుల కుమార్తె అయిన సింధు ఒకటి నుంచి పదో తరగతి వరకు కంప్లిలో, పీయూసీ ధారవాడలో, బీఎస్సీ మునిరాబాద్‌లో చదివారు. మూడగిరి ఉద్యాన కళాశాలలో ఎమ్మెస్సీ విద్య అభ్యసించిన ఆమె 9.21 గ్రేడ్‌ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం సింధు దిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పుష్ప కృషి ఉద్యాన కళాశాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. శాస్త్రవేత్త అయి ఉద్యాన పంటలు, సేంద్రియ సాగుపై రైతుల్లో చైతనన్యం కలిగించాలన్నదే తన లక్ష్యమని సింధు పేర్కొన్నారు. కంప్లి కమ్మ సంఘం కార్యదర్శి కోనేరు శ్రీరామకృష్ణ తదితరులు సింధును అభినందించారు.

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని