logo

జాతీయ ఫుట్‌బాల్‌ రెఫరీలుగా ఎంపిక

కర్ణాటకకు చెందిన హర్షసైని, పూజా జాతీయ రెఫరీలుగా అర్హత పొందారని ఫుట్‌బాల్‌ సంఘం రెఫరీస్‌ కమిటీ ప్రకటించినట్టు రాష్ట్ర ఫుట్‌బాల్‌ సంఘం తెలిపింది. రెండేళ్ల పరధిలో తొలిసారిగా ఇద్దరు మహిళలు రెఫరీలుగా అర్హత పొందడం విశేషం. ఈ నెల 11న గ్వాలియర్‌లో జరిగిన క్యాటగిరీ-2 అప్‌గ్రేడ్‌కు సంబంధించిన రాత పరీక్షల్లో

Published : 17 Jan 2022 04:45 IST

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే: కర్ణాటకకు చెందిన హర్షసైని, పూజా జాతీయ రెఫరీలుగా అర్హత పొందారని ఫుట్‌బాల్‌ సంఘం రెఫరీస్‌ కమిటీ ప్రకటించినట్టు రాష్ట్ర ఫుట్‌బాల్‌ సంఘం తెలిపింది. రెండేళ్ల పరధిలో తొలిసారిగా ఇద్దరు మహిళలు రెఫరీలుగా అర్హత పొందడం విశేషం. ఈ నెల 11న గ్వాలియర్‌లో జరిగిన క్యాటగిరీ-2 అప్‌గ్రేడ్‌కు సంబంధించిన రాత పరీక్షల్లో హర్షసైని, పూజ ఉత్తీర్ణులైనట్టు అఖిల భారత రెఫరీ సమాఖ్య ప్రకటించింది. 2017లో హర్షసైని, పూజ తమ రెఫరీ వృత్తిని ప్రారంభించారు. 2020-21 రెఫరీలో ఎంఏ కోర్సు చేసిన వీరిద్దరూ ఇండియన్‌ మహిళల లీగ్‌ క్వాలీఫైర్‌ పోటీలు, మహిళల సూపర్‌ డివిజన్‌, ఏ డివిజన్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు, పురుషుల విభాగంలో నిర్వహించిన ఏబీసీ డివిజన్‌ పోటీలు, కర్ణాటక ఫుట్‌బాల్‌ సంఘం నిర్వహించిన యూత్‌ లీగ్‌ పోటీల్లో రెఫరీలుగా వ్యవహరించారు. వీరిద్దరూ జాతీయ రెఫరీలుగా అర్హత పొందడంపై కర్ణాటక ఫుట్‌బాల్‌ సంఘం హర్షం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని