logo

మూగబోయిన కరావళి కోకిల

కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు.

Updated : 26 Apr 2024 02:38 IST

 

 భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర

ఉడుపి, న్యూస్‌టుడే : ‘కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. ఉడుపి జిల్లా కుందాపుర తాలూకా నాగూరులోని ఆయన నివాసం ఆవరణలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. యక్షగాన ప్రదర్శనలో భాగవత కళాకారులదే ప్రధాన పాత్ర. ఆయా పాత్రలకు తగినట్లు పాటలు పాడుతూ వ్యాఖ్యానాన్ని చెబుతారు. సుమారు 46 ఏళ్ల పాటు యక్షగాన ప్రదర్శనలకు ధారేశ్వర సేవలందించారు. ఆయన స్వరం అందించిన యక్షగాన ప్రదర్శనలకు సంబంధించి 400కు పైగా ఆడియో సీడీలు, క్యాసెట్లు మార్కెట్లో ఉన్నాయి. కోటె అమృతేశ్వరి మేళాలో, పెర్డూరు మేళాలో ప్రధాన భాగవతగా ఆయన పాల్గొంటూ వచ్చారు. కర్ణాటక రాజ్యోత్సవ పురస్కారంతో పాటు పలు అవార్డులు ఆయన అందుకున్నారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, స్పీకర్‌ యూటీ ఖాదర్‌, మాజీ మంత్రి కోటా శ్రీనివాస పూజారి తదితరులు సంతాపాన్ని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని