logo

మోదీని ప్రశ్నించలేని జోషి

హుబ్బళ్లి-ధార్వాడ లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వినోద్‌ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.

Published : 26 Apr 2024 02:17 IST

సీఎం సిద్ధరామయ్య ఎద్దేవా 

కాంగ్రెస్‌లో చేరిన నేతలకు పతాకాన్ని అందిస్తున్న   ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : హుబ్బళ్లి-ధార్వాడ లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వినోద్‌ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు. కర్ణాటకకు రావలసిన పన్ను వాటా విషయంలో కేంద్ర మంత్రి, స్థానిక భాజపా అభ్యర్థి ప్రహ్లాద్‌ జోషి ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. శిగ్గావ్‌ సమీపంలోని తడస క్రాస్‌ వద్ద గురువారం నిర్వహించిన బహిరంగ సభలో అసోటికి మద్దతుగా నిర్వహించిన సభలో సిద్ధు మాట్లాడారు. శ్రీమంతులు, పారిశ్రామికవేత్తలకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన ప్రధాని మోదీ, ధార్వాడకు ఏం మేలు చేశారని ప్రశ్నించారు. మోదీ చేసిన అన్యాయాన్ని ప్రహ్లాద్‌ జోషి ఒక్కసారీ ప్రశ్నించలేదని తప్పుబట్టారు. కర్ణాటకకు 15వ ఆర్థిక సంఘం నుంచీ వంచన జరిగిందన్నారు. కరవు పరిస్థితులు ఉన్నప్పుడు పరిహారాన్ని విడుదల చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చిందన్నారు. ప్రహ్లాద్‌ జోషిని ఓడిస్తామని వేదికపై ఉన్న మంత్రి సంతోశ్‌ లాడ్‌, ఎమ్మెల్యేలు కోనరెడ్డి, వినయ్‌ కులకర్ణి, ఎమ్మెల్సీ సలీం అహ్మద్‌, స్థానిక నాయకులు యాసిర్‌ ఖాన్‌ పఠాన్‌, సోమణ్ణ బేవినమర, అజీం పీర్‌ ఖాద్రి తదితరులు శపథం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని