logo

తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య

భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్‌ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు.

Updated : 26 Apr 2024 02:40 IST

దావణగెరె, న్యూస్‌టుడే : భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్‌ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. జగళూరు తాలూకా లక్కింపుర గ్రామంలో తండ్రి తలపై బండరాయి వేసి రమేశ్‌ హత్య చేశాడని పోలీస్‌ అధికారులు వివరించారు. జగళూరు గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు