logo

పత్రకళలో ఎనలేని తృప్తి

లీఫ్‌ ఆర్ట్‌.. ఇటీవలి కాలంలో ఔత్సాహికులను విశేషంగా ఆకర్షిస్తున్న కళగా ప్రాచుర్యం పొందింది. ఇతర కళలకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరం. పత్ర కళకు అలాంటి ఇబ్బంది ఎంతమాత్రం ఉండదు. కాసిన్ని ఆకులు లభిస్తేసరి! కళ్లముందు కోరుకున్న ఆకారంలో

Published : 23 May 2022 01:38 IST

పనస ఆకులపై జాతీయ గీతం

పత్రకళలో సాధించిన రికార్డును చూపుతున్న తృప్తి మంజునాథ్‌

కార్వార, న్యూస్‌టుడే : లీఫ్‌ ఆర్ట్‌.. ఇటీవలి కాలంలో ఔత్సాహికులను విశేషంగా ఆకర్షిస్తున్న కళగా ప్రాచుర్యం పొందింది. ఇతర కళలకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరం. పత్ర కళకు అలాంటి ఇబ్బంది ఎంతమాత్రం ఉండదు. కాసిన్ని ఆకులు లభిస్తేసరి! కళ్లముందు కోరుకున్న ఆకారంలో సాక్ష్కాత్కరిస్తుంది. ఉత్తర కన్నడ జిల్లా సిద్ధాపుర తాలూకా బీళగి సమీపంలోని హొసమంజు గ్రామానికి చెందిన తృప్తి మంజునాథ్‌ అనే యువతి జాతీయ గీతాన్ని లీఫ్‌ ఆర్ట్‌ ద్వారా ఎనిమిది పనస ఆకుల్లో చెక్కారు. దీనికి ఇండియా బుక్‌ ఆప్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది. యల్లాపురలో డిగ్రీ చదివే దశలోనే ఈకళపై ఆసక్తిని పెంచుకున్నట్లు ఆమె తెలిపారు. స్నాతకోత్తర కోర్సును పూర్తి చేసుకుని బీఎడ్‌ చదువుతున్న సమయంలో పత్రకళను నిర్లక్ష్యం చేయకుండా కొనసాగిస్తున్నానని చెప్పారు. గత మార్చి 19న ఎనిమిది పనస ఆకులపై చెక్కిన జాతీయ గీతానికి పురస్కారం లభించడంతో మరింత ఉత్సాహం కలుగుతోందన్నారు. రాబోయే కాలంలో మరిన్ని ప్రముఖ ఘట్టాల్ని ఆకులపై చెక్కనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని