logo

చందన నగరిలో విరాట్‌ కోహ్లి సందడి

భారత క్రికెట్‌ జట్టు మాజీ నాయకుడు విరాట్‌ కోహ్లి ‘నమస్కార బెంగళూరు’ అనగానే వందల మంది అభిమానులు కేకలు వేసి కోహ్లిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Published : 27 Mar 2023 02:24 IST

పరుగును ప్రారంభించాక అభిమానుల మధ్య కోహ్లి సందడి

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడేే: భారత క్రికెట్‌ జట్టు మాజీ నాయకుడు విరాట్‌ కోహ్లి ‘నమస్కార బెంగళూరు’ అనగానే వందల మంది అభిమానులు కేకలు వేసి కోహ్లిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. కన్నడలో నమస్కారం చెబుతూ  మారథాన్‌ పరుగులో పాల్గొన్న క్రీడాకారులకు కోహ్లి ఊపునిచ్చారు. ఆదివారం ఎన్‌ఈబీ 18కే మారథాన్‌ పరుగు కార్యక్రమానికి విరాట్‌కొహ్లి పచ్చజెండా ఊపారు. హొసకెరెహళ్లి టోల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు, ప్రొఫెషనల్స్‌ పాల్గొని సందడి చేశారు. వచ్చే వారంలో నగరంలోని చిన్నస్వామి మైదానంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) క్రికెట్‌ పోటీలు ప్రారంభం కానుండటంతో స్థానిక రాయల్‌ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున విరాట్‌ కోహ్లి పాల్గొంటుండటం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సందర్భంగా కోహ్లి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పరుగుదారులు పాల్గొంటారని ఊహించలేదన్నారు. మారథాన్‌లో పాల్గొన్న వారి సంఖ్యను చూసి ఆనందం కలుగుతోందన్నారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం శారీరక దృఢత్వం (ఫిట్‌నెస్‌) చాలా ముఖ్యమన్నారు. 18 కిలోమీటర్ల పరుగులో పురుషుల విభాగంలో శివంయాదవ్‌, మహిళల విభాగంలో ఆరాధన తొలి స్థానాలను పొందగా, పది కిలోమీటర్ల పరుగులో వైభవ్‌ అగ్రస్థానంలో నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని