logo

యాప్‌ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్‌లను సిద్ధం చేసింది. ఈ యాప్‌లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తెలిపారు.

Published : 29 Mar 2024 03:22 IST

జిల్లా ఎన్నికల అధికారి మిశ్రా వెల్లడి

బళ్లారి : లోక్‌సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రవేశపెట్టిన వివిధ యాప్‌లు

బళ్లారి, న్యూస్‌టుడే: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్‌లను సిద్ధం చేసింది. ఈ యాప్‌లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తెలిపారు. మొబైల్‌ టెక్నాలజీ సాయంతో ఓటరు గుర్తింపు కార్డు సందేహం, ఎన్నికల ప్రక్రియ, తమ పరిధిలోని అభ్యర్థుల వివరాలు వంటి అన్ని సమాచారాన్ని పొందవచ్చు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా, అత్యంత విశ్వసనీయంగా నిర్వహించాలనే సంకల్పంతో ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. ఇందుకు సంబంధించి ఓటర్లు, సిబ్బంది, కమిషన్‌కు సాయం చేసేందుకు ఎన్నికల సంఘం అనేక యాప్‌లను రూపొందించింది. అందులో సువిధా పోర్టల్‌ ఒకటని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా

సువిధా పోర్టల్‌ ఉపయోగకరం

అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఆన్‌లైన్‌లో నామినేషన్‌ పత్రాలు సమర్పించి అనుమతులు పొందేందుకు వీలుగా సువిధా పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు డీసీ తెలిపారు. నామినేషన్‌ పత్రాలను పూరించడానికి ఎన్నికల సంఘం నామినేషన్‌ పత్రాలు, అఫిడవిట్‌ నింపడానికి సువిధా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. అభ్యర్థి తన ఖాతాను సృష్టించడానికి సువిధా పోర్టల్లోకి వెళ్లాలన్నారు. ఓపెన్‌ చేసిన ఖాతాలోకి సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాలి, ఒకరు టైమ్‌ స్లాట్‌ చేయాలి. ఒకరు టైమ్‌ స్లాట్‌ లభ్యతను తనిఖీ చేయవచ్చు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులను పూరించిన తర్వాత, అభ్యర్థి ఫొటోకాపీని తీసుకొని, దానిని నోటరీ చేసి సంబంధిత పత్రాలతో పాటు దరఖాస్తులను రిటర్నింగ్‌ అధికారికి వ్యక్తిగతంగా సమర్పించాలన్నారు.


లౌడ్‌ స్పీకర్లకు అనుమతి

ఎన్నికల ప్రచారంలో భాగంగా లౌడ్‌ స్పీకర్ల కోసం దరఖాస్తులను చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కంప్లి-1, సిరుగుప్ప-4, బళ్లారి నగర-4, సండూరు-1తో కలిపి మొత్తం 10 దరఖాస్తులను సమర్పించారన్నారు. లౌడ్‌స్పీకర్లు లేకుండా సమావేశాలు నిర్వహించడానికి సండూరు తాలూకాలో ఒక దరఖాస్తు సమర్పించినట్లు తెలిపారు. తాత్కాలిక రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించడానికి సండూరులో అనుమతి తీసుకున్నారన్నారు. లౌడ్‌స్పీకర్లతో ప్రచార వాహనం కోసం బళ్లారి గ్రామీణ-2 దరఖాస్తులు సమర్పించి అనుమతి తీసుకున్నారని డీసీ వివరించారు. వీటితో పాటు సి-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేయడానికి ఉపయోగిస్తున్నారు. సాక్ష్యం యాప్‌, ఓటర్‌ యాప్‌లను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.


ఓటర్లకు అవగాహన అవసరం

మాట్లాడుతున్న జడ్పీ సీఈవో రాహుల్‌ శరణప్ప సంకనూర తదితరులు

బళ్లారి: కురుగోడు తాలూకాలో విధానసభ ఎన్నికల్లో అతి తక్కువ పోలింగ్‌ శాతం నమోదైన బూత్‌లను గుర్తించి..లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచే విధంగా అధికారులు, సిబ్బంది ఓటర్లకు అవగాహన కల్పించాలని జిల్లా పంచాయతీ సీఈవో రాహుల్‌ శరణప్ప సంకనూర సూచించారు. కురుగోడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బూత్‌ స్థాయి అధికారులు, సెక్టార్‌ అధికారులు, తాలూకా స్వీప్‌ సమితి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అతి తక్కువ పోలింగ్‌ నమోదైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, ఇంటింటికీ వెళ్లి ఓటింగ్‌ ప్రాముఖ్యతను వివరించి, వారి చరవాణి సంఖ్యను కూడా సేకరించాలని సూచించారు. ఓటింగ్‌పై నిరంతరం వారికి అవగాహన కలిగించాలన్నారు. ఉద్యోగం కోసం వలస వెళ్లిన వారి వివరాలు తీసుకుని మాట్లాడి వారు వచ్చే విధంగా చూడాలన్నారు. స్థానికంగా వలస వెళ్లిన వారికి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామని భరోసా ఇవ్వాలన్నారు. జిల్లా పంచాయతీ ముఖ్య యోజనాధికారి వాగీశ్‌ శివాచార్య, తహసీల్దార్‌ రేణుక, తాలూకా పంచాయతీ ఈవో నిర్మల, అధికారులు శివరామరెడ్డి, రాధిక పాల్గొన్నారు.


చైతన్యానికి ముగ్గుల పోటీ

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళా స్వసహాయ సంఘాల ప్రతినిధులు

చెళ్లకెర(చిత్రదుర్గం): లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి జిల్లా స్వీప్‌ సమితి బాధ్యులు ఓటరు చైతన్యంపై పలు పోటీలను నిర్వహిస్తున్నారు. గురువారం మలేబెన్నూరులో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళా స్వసహాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందమైన రంగవల్లులను వేసి ఓటరు బాధ్యతలను గుర్తు చేశారు. ఉత్తమ రంగవల్లులకు అధికారులు బహుమతులను అందజేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ సురేశ్‌, తదితరులు పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని