logo

Tomato: పాస్‌పోర్టు ఫొటోలు తీసుకుంటే.. టమాటాలు ఉచితం!

టమాటా ధర ఆకాశాన్నంటుతున్న తరుణంలో.. ఓ ఫొటోగ్రాఫర్‌ వినూత్న ఆలోచన చేశాడు. స్మార్ట్‌ఫోన్ల వినియోగం, కలెక్టరేట్‌ తరలింపుతో నానాటికీ పడిపోతున్న గిరాకీ కాస్తయినా పెరుగుతుందని ఆయన భావించాడు.

Updated : 03 Aug 2023 07:24 IST

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే: టమాటా ధర ఆకాశాన్నంటుతున్న తరుణంలో.. ఓ ఫొటోగ్రాఫర్‌ వినూత్న ఆలోచన చేశాడు. స్మార్ట్‌ఫోన్ల వినియోగం, కలెక్టరేట్‌ తరలింపుతో నానాటికీ పడిపోతున్న గిరాకీ కాస్తయినా పెరుగుతుందని ఆయన భావించాడు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడెం బస్టాండ్‌ కాంప్లెక్స్‌లో పట్టణానికి చెందిన ఆనంద్‌ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నారు. గతంలో స్థానికంగా కలెక్టరేట్‌ ఉన్నప్పుడు వ్యాపారం బాగానే నడిచేది. జిల్లా కలెక్టరేట్‌ పాల్వంచ మారడంతో గిరాకీ తగ్గింది. దీంతో తన వద్ద రూ.100 వెచ్చించి పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు (8) తీసుకున్న వారికి పావు కిలో టమాటా ఉచితం అంటూ ప్రకటించి పట్టణ వాసుల దృష్టిని ఆకట్టున్నారు. అంతటితో సరిపెట్టుకోకుండా.. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడాన్ని పురవాసులు ఆసక్తిగా చూస్తున్నారు. ‘వినూత్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 32 మంది వినియోగదారులు వచ్చారు. రూ.100 వెచ్చించి ఫొటోలు తీసుకున్న వారికి రూ.40 విలువైన పావు కిలో టమాటాలు అందజేసినట్లు’ ఆనంద్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని