logo

ODI World cup: నీ అభిమానం బంగారంగాను..

వన్డే ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీల్లో పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించినందుకు గుర్తుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన ఓ స్వర్ణకారుడు అతిచిన్న కప్‌ను రూపొందించి అబ్బురుపరుస్తున్నాడు.

Updated : 25 Oct 2023 07:33 IST

అతి చిన్న పరిమాణంలో ప్రపంచకప్‌ రూపొందించిన స్వర్ణకారుడు

నాగేశ్వరరావు తయారుచేసిన బంగారు ప్రపంచ్‌ కప్‌

వన్డే ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీల్లో పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించినందుకు గుర్తుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన ఓ స్వర్ణకారుడు అతిచిన్న కప్‌ను రూపొందించి అబ్బురుపరుస్తున్నాడు. కేవలం 4 మిల్లీ మీటర్ల వెడల్పు, 8 మి.మీ. ఎత్తు, 90 మిల్లీ గ్రాముల బరువుతో అతి చిన్న బంగారు ప్రపంచ కప్‌ని తయారు చేసి క్రికెట్‌, భారత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.. కొత్తగూడెం చిన్నబజార్‌కి చెందిన స్వర్ణకారుడు కోడూరు నాగేశ్వరరావుకు క్రికెట్‌ అంటే ఎంతో మక్కువ. దీంతో ప్రపంచ కప్‌ పోటీలను మొదటి నుంచి ఆసక్తిగా తిలకిస్తున్నాడు. ఈనెల 14న పాకిస్థాన్‌పై రోహిత్‌ సేన ఘన విజయం సాధించిన ఆనంద క్షణాలను మదిలో పదిలంగా దాచుకోవడంతోపాటు, పది మందితో ఆ సంతోషాన్ని పంచుకోవాలని తలచాడు. 2023 ప్రపంచకప్‌ని భారత్‌ కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ బంగారంతో అతిచిన్న కప్‌ని రూపొందించాడు. ఈ అతి చిన్న కప్‌ను పాకిస్థాన్‌పై గెలిచిన భారత క్రికెట్‌ జట్టుకు అంకితం చేస్తున్నట్లు కోడూరు నాగేశ్వరరావు ప్రకటించాడు. ఇది క్రికెట్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకోవడంతోపాటు నాగేశ్వరరావును పలువురు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని