logo

Bhadradri Kothagudem: అడవిలో అర్ధరాత్రి ప్రసవ వేదన

స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ పలు గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేక అడవి బిడ్డలు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు.

Updated : 29 Dec 2023 06:57 IST

బిడ్డతో పార్వతి

స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ పలు గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేక అడవి బిడ్డలు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారు. కీకారణ్య ప్రాంతాల్లోని గర్భిణుల పరిస్థితి నేటికీ దయనీయమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మారుమూల రాళ్లాపురం అటవీ గ్రామానికి చెందిన నిండు గర్భిణి పొడియం పార్వతి అడవితల్లి సాక్షిగా రాత్రిలో ప్రసవవేదనతో అల్లాడిపోయింది. గ్రామంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పార్వతికి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. తీవ్రంగా బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఆ చీకట్లోనే మంచాన్నే జట్టీగా మార్చి అధ్వానంగా ఉన్న కాలిదారిలో రాళ్లాపురం నుంచి అడవిలో ప్రాజెక్టు సమీపంలోని 3 కి.మీ మేర ఉన్న ప్రధాన రహదారికి మోసుకొచ్చారు. అనంతరం ఆటోలో ఆమెను చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఆసుపత్రిలో గర్భిణికి వైద్యులు ప్రసవం చేశారు. పండంటి పాపకు పార్వతి జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండటంతో గురువారం ఆమెను ఇంటికి పంపించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామ గోండీ ఆదివాసీలు వేడుకుంటున్నారు.

చర్ల, న్యూస్‌టుడే

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని