logo

9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్‌రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.

Updated : 29 Mar 2024 04:50 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీఓ దామోదర్‌రావు, చిత్రంలో ఈఓ రమాదేవి

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్‌రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నందున భక్తుల సంఖ్య  గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కల్యాణ మండప ప్రాంగణాన్ని 26 సెక్టార్లుగా విభజించి ప్రతి విభాగంలో పర్యవేక్షణ పెంచాలని సూచిం చారు.లాడ్జీలు, హోటళ్ల నిర్వాహకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈఓ రమాదేవి మాట్లాడుతూ ఏప్రిల్‌ 16న ఎదుర్కోలు, 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేకం వేడుకలకు వచ్చే భక్తులకు అవసరమయ్యే సదుపాయాలు కల్పించేందుకు అన్ని శాఖలు సహకరించాలన్నారు. 2 లక్షల లడ్డూలు, 200 క్వింటాళ్ల బియ్యంతో తలంబ్రాలు తయారుచేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు 230 ఆర్టీసీ బస్సులు తిప్పనున్నట్లు డీఎం రామారావు వివరించారు. సమావేశంలో రామాలయం స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, ఈఈ రవీంద్రనాథ్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

  • దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు భద్రాచలంలో శుక్రవారం పర్యటించనున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని