logo

‘ఎర్లీబర్డ్‌’ రాబడి రూ.15.15 కోట్లు

ఐదు శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లింపునకు పురపాలక శాఖ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లోని నగర, పురపాలికల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది

Published : 03 May 2024 02:31 IST

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఐదు శాతం రాయితీతో ఆస్తిపన్ను చెల్లింపునకు పురపాలక శాఖ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లోని నగర, పురపాలికల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ అవకాశాన్ని 26,646 మంది భవన యజమానులు వినియోగించుకున్నారు. తద్వారా ఆయా నగర, పురపాలికలకు రూ.15.15 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా ఖమ్మం నగరపాలక సంస్థకు రూ.9.73 కోట్లు రాగా అత్యల్పంగా ఇల్లెందు పురపాలిక రూ.30 లక్షలు వసూలు చేసింది. ఈనెల మొదటి వారంలో ఈ పథకాన్ని పురపాలక శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో సిబ్బంది ఎన్నికల విధులు, పన్నుల వసూలు చేపట్టడంతో తొలుత మందకొడిగా సాగింది. తరువాత దీనిపై ప్రచారాన్ని ముమ్మరం చేయడం, పట్టణవాసులు స్పందించడంతో ఆశించిన మేరకు పన్నులు వసూలయ్యాయి. ఉన్నతాధికారులు  నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పన్నులు వసూలు చేయగలిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు