logo

భానుడి భగభగలతో రెడ్‌ అలర్ట్‌

జిల్లాలో ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్నందున రెడ్‌ అలర్ట్‌ (అత్యంత ప్రమాదకర స్థాయి)ను ప్రకటించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జేవీఎల్‌ శిరీష గురువారం తెలిపారు.

Updated : 03 May 2024 05:47 IST

కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఎండల తీవ్రత అత్యధికంగా ఉన్నందున రెడ్‌ అలర్ట్‌ (అత్యంత ప్రమాదకర స్థాయి)ను ప్రకటించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జేవీఎల్‌ శిరీష గురువారం తెలిపారు. జిల్లాలోని  వివిధ మండలాల్లో 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుండటంతో ప్రజలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సూచనలతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప జనం బయటికి వెళ్లకూడదన్నారు. ఎండబారిన పడకుండా పగటి పూట కిటికీలు, కర్టెన్లు మూసి ఉంచాలని సూచించారు. రాత్రి సమయంలో చల్లని గాలి వచ్చేలా తలుపులు తెరవాలన్నారు. ఎండ ప్రభావంతో శిశువులు, బాలలు, గర్భిణులు, వృద్ధులు, ఆరుబయట పనిచేసేవారు, రోగులు వెంటనే అస్వస్థతకు గురయ్యే ఆస్కారం ఉన్నందున చల్లటి వాతావరణానికి పరిమితం కావాలని సూచించారు. దాహం వేయకున్నా తరచూ నీరు తాగాలన్నారు. వడదెబ్బ లక్షణాలు ఉన్నట్లు గమనిస్తే సత్వరం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు