logo

వైభవంగా రాములోరికి అభిషేకం

భద్రాచలం రామాలయ క్యూలైన్లు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. ప్రధాన కోవెలలో అర్చకులు సుప్రభాత సేవ చేసి అభిషేక మహోత్సవాన్ని కొనసాగించారు.

Updated : 06 May 2024 06:03 IST

భద్రాచలం: భద్రాచలం రామాలయ క్యూలైన్లు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. ప్రధాన కోవెలలో అర్చకులు సుప్రభాత సేవ చేసి అభిషేక మహోత్సవాన్ని కొనసాగించారు. మూలవిరాట్‌కు బంగారు పుష్పాలతో అర్చన చేశారు. వారానికి ఒక్కసారి ఉండే క్రతువు కావడంతో విశేష సంఖ్యలో తరలివచ్చి దేవదేవుడ్ని దర్శించుకున్నారు. క్షేత్ర విశిష్టత పరమానందాన్ని కలిగించగా వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం కొనసాగించారు. వధూవరుల గోత్ర నామాలను చదివి ప్రవర పఠించారు. మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక, దర్బారు సేవ భక్తులను తన్మయత్వంలో ముంచెత్తాయి. సోమవారం ముత్తంగి రూపంలో స్వామివారు దర్శనమీయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు