logo

నమూనా కేంద్రం.. ఆకర్షణీయం

ఓటు వేసేందుకు వచ్చేవారిని ఆకట్టుకునే నమూనా పోలింగ్‌ కేంద్రాలను తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు 15 నమూనా కేంద్రాలను ఖమ్మం కలెక్టర్‌ గౌతమ్‌ ఎంపిక చేశారు.

Published : 07 May 2024 02:06 IST

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: ఓటు వేసేందుకు వచ్చేవారిని ఆకట్టుకునే నమూనా పోలింగ్‌ కేంద్రాలను తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు 15 నమూనా కేంద్రాలను ఖమ్మం కలెక్టర్‌ గౌతమ్‌ ఎంపిక చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, దివ్యాంగులు, యువత విభాగాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మహిళా కేంద్రంలో సిబ్బంది అంతా మహిళలే ఉంటారు. యువ కేంద్రంలో యువత, దివ్యాంగుల విభాగంలో అందుబాటులో ఉన్న మేరకు దివ్యాంగులను పోలింగ్‌ సిబ్బందిగా నియమించనున్నారు. ఎంపిక చేసిన కేంద్రాలను ప్రత్యేకంగా అలంకరించనున్నారు. నమూనా కేంద్రాల్లో కూలర్లు, రంగురంగుల బెలూన్లు అమర్చటం, ఓటర్లు కేంద్రంలోని చేరే వరకు తివాచీ(కార్పెట్‌) పరవడం, వరుసలో నిలబడకుండా కూర్చునేందుకు వీలుగా కుర్చీల ఏర్పాటు, నీడకోసం షామియానాలు, తాగునీరు, చక్రాల కుర్చీలు ఏర్పాటు చేశారు. సెల్ఫీ పాయింట్స్‌ ఏర్పాటు చేయనున్నారు. వివాహ వేడుకల్లో చేసినట్లు ఆహూతులపై సుగంధ ద్రవ్యాలు చల్లుతూ, పువ్వులు అందించి లోనికి ఆహ్వానిస్తారు. ఓటర్లతో వచ్చే పిల్లలు ఆడుకునేందుకు సదుపాయాలు కల్పించనున్నారు.

దివ్యాంగుల విభాగంలో.....

ఖమ్మం: రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ హైస్కూల్‌లోని నెం.317 పోలింగ్‌ కేంద్రం

 పాలేరు: ఖమ్మం రూరల్‌ మండలం గోళ్లపాడు జడ్పీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రం నెం.80

 మధిర: జానకీపురంలోని జడ్పీ సెకండరీ స్కూల్‌లో నెం.130 పోలింగ్‌ కేంద్రం
వైరా: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని నెం.207 పోలింగ్‌ కేంద్రం
సత్తుపల్లి: కిష్టారం జడ్పీ హై స్కూల్‌ నెం.203 పోలింగ్‌ కేంద్రం

యువత విభాగంలో....

ఖమ్మం: ఎస్‌ఆర్‌బీజీఎన్నార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెం.156 పోలింగ్‌ కేంద్రం
పాలేరు: ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాలోని మండల పరిషత్‌ ప్రైమరీ పాఠశాలలో నెం.129 పోలింగ్‌ కేంద్రం
మధిర: సుందరయ్య నగర్‌లోని మండల పరిషత్‌ ప్రైమరీ స్కూల్‌లో నం.178 కేంద్రం
వైరా: గుట్టబడి మండల పరిషత్‌ ప్రైమరీ స్కూల్‌లో నెం.204 పోలింగ్‌ కేంద్రం
సత్తుపల్లి: గౌరిగూడెంలోని మండల పరిషత్‌ పాఠశాలలో నెం.216 పోలింగ్‌ కేంద్రం.

మహిళా విభాగంలో...

ఖమ్మం: ఎన్నెస్పీ క్యాంపులోని ప్రభుత్వ హైస్కూల్‌ నెం.110 పోలింగ్‌ కేంద్రం
పాలేరు: పాలేరు జడ్పీ హై స్కూల్‌లోని నెం.177 పోలింగ్‌ కేంద్రం
మధిర: జడ్పీ గర్ల్స్‌ సెకండరీ స్కూల్‌ నెం.187 పోలింగ్‌ కేంద్రం
వైరా:  ప్రభుత్వ హైస్కూల్‌లో నెం.201 పోలింగ్‌ కేంద్రం
సత్తుపల్లి: తల్లాడ జడ్పీ హైస్కూల్‌లోని నెం.18 పోలింగ్‌ కేంద్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని