logo

సత్వర న్యాయమే ప్రథమ ప్రాధాన్యం: జిల్లా జడ్జి

కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే ప్రథమ ప్రాధాన్యమని, న్యాయవాదులు బెంచ్‌కు సహకరించాలని జిల్లా జడ్జి జి.రాజగోపాల్‌ అన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి చింతనిప్పు వెంకట్‌ ఆధ్వర్యంలో బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో నూతన న్యాయాధికారుల పరిచయ కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు.

Updated : 08 May 2024 05:42 IST

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జి.రాజగోపాల్‌, చిత్రంలో సీనియర్‌ సివిల్‌ జడ్జిలు చంద్రశేఖర్‌రావు, కల్పన తదితరులు

ఖమ్మం న్యాయవిభాగం, న్యూస్‌టుడే: కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే ప్రథమ ప్రాధాన్యమని, న్యాయవాదులు బెంచ్‌కు సహకరించాలని జిల్లా జడ్జి జి.రాజగోపాల్‌ అన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి చింతనిప్పు వెంకట్‌ ఆధ్వర్యంలో బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో నూతన న్యాయాధికారుల పరిచయ కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి రాజగోపాల్‌, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి చంద్రశేఖరరావు, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.కల్పనకు  స్వాగతం పలికారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ పెండింగ్‌ కేసుల పరిష్కారం, కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమేనని తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు. న్యాయాధికారులు ఉమాదేవి, అపర్ణ, దీప, రజనీ, బిందుప్రియ, మాధవి, శాంతిలత, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు కొల్లి సత్యనారాయణ, వడ్డెల్లి  కృష్ణమూర్తి, మందడపు శ్రీనివాసరావు, మలీదు నాగేశ్వరరావు, నల్లమల నవీన్‌ చైతన్య, కె.ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాసరావు, అలవాల యుగంధర్‌, టి.లలిత, అనురాధ, దుర్గారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు